వారంలో రూ.250 కోట్లు దాటేసిన రేస్3

వారంలో రూ.250 కోట్లు దాటేసిన రేస్3

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈద్ కానుక, రేస్ 3 బాక్సాఫీస్ రేసులో దూసుకెళ్తోంది. వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 255.54 కోట్లు కొల్లగొట్టి మరోసారి సల్మాన్ స్టార్ పవర్ ఏంటో చాటింది. రెమో ఫెర్నాండెజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ రేస్ ఫ్రాంచైజీపై విమర్శకులు పెదవి విరిచారు. కానీ రేస్ 3 భాయ్ ఫ్యాన్స్ కి మాత్రం పిచ్చిగా నచ్చేసింది. 2018లో విడుదలైన చిత్రాల్లో రెండో భారీ ఓపెనింగ్స్ సాధించిన రేస్ 3 మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు సంపాదించి బాక్సాఫీస్ దగ్గర సల్లూ సత్తాని నిరూపించింది. భారత్ లోనే ఇప్పటి వరకు రూ.150 కోట్లకు పైగా ఆర్జించింది. ఈ నెల 29న మరో పెద్ద చిత్రం సంజూ రిలీజ్ కానుంది. అప్పటి వరకు టికెట్ కౌంటర్ల దగ్గర సుల్తాన్ భాయిగిరి నడిచే అవకాశం ఉంది.