న్యూ పోస్ట‌ర్‌: డియోల్‌తో జాక్విలిన్

న్యూ పోస్ట‌ర్‌: డియోల్‌తో జాక్విలిన్
కొరియోగ్రాఫ‌ర్ ట‌ర్న్‌డ్ డైరెక్ట‌ర్‌ రెమో.డి.సౌజా దర్శకత్వంలో  `రేస్ 3` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రేజీ సీక్వెల్ మూవీ ఇప్ప‌టికే బాలీవుడ్ లో వేడి పెంచుతోంది. ఎస్‌.కె.ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని క్రేజీగా నిర్మిస్తోంది. ఇదివ‌ర‌కూ స‌ల్మాన్‌, జాక్విలిన్‌, అనీల్ క‌పూర్‌పై పోస్ట‌ర్ల‌ను రిలీజ్ చేసి వేడి పెంచారు. తాజాగా మ‌రో అదిరిపోయే పోస్ట‌ర్‌ని చిత్ర‌యూనిట్ రిలీజ్ చేసింది. 
 
ఈ పోస్ట‌ర్‌లో జాక్విలిన్ సంథింగ్ స్పెష‌ల్‌. అంతేకాదు అస‌లు ఈ చిత్రంలో జాక్విలిన్ ఎవ‌రికి జోడీగా న‌టిస్తోంది అన్న సందిగ్ధాన్ని తాజా పోస్ట‌ర్ రాజేసింది. ఇదివ‌ర‌కూ  స‌ల్మాన్ - జాక్విలిన్ జంట పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు. ఇప్పుడిలా డియోల్‌తో జాక్విలిన్ పోస్ట‌ర్‌ని ఆవిష్క‌రించారు. అడుగ‌డుగునా ఎత్తుగ‌డ‌లు, మోసం- ప్ర‌తిమోసం అన్న బేసిస్‌పై `రేస్` సిరీస్ క‌థాంశాలు ఆక‌ట్టుకున్నాయి. గ‌తంలో రిలీజైన సీక్వెల్ సినిమాలోనూ క‌థానాయిక‌ల కోవ‌ర్ట్ ఆప‌రేష‌న్ ఆక‌ట్టుకుంది. ఈసారి కూడా `రేస్ 3`లో ఆ త‌ర‌హా పాత్ర ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. జాక్విలిన్ స్పై త‌ర‌హా పాత్ర‌లో న‌టిస్తోంది కాబ‌ట్టి ఇలా హీరోల‌తో ఆడుకుంటుందా? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు. అయితే ఈ ట్విస్టుల్ని రెమో డిసౌజా ఎలా రివీల్ చేస్తాడు? అన్న ఆస‌క్తి ప్రేక్ష‌కాభిమానుల్లో అంచ‌నాలు పెంచేస్తోంది. ఆ ట్విస్టేంటో తెలియ‌లంటే ఈద్ వేళ రిలీజ్ వ‌ర‌కూ ఆగాల్సిందే.