సల్మాన్.. రెమోల మధ్య రేస్ 3 వివాదం

సల్మాన్.. రెమోల మధ్య రేస్ 3 వివాదం

సల్మాన్ నటించి నిర్మించిన రేస్ 3 సినిమా రంజాన్ రోజున రిలీజ్ అయ్యి.. భారీ పరాజయం పాలైంది.  రేస్ 3 పై దర్శకుడు రెమో చాలా ఆశలు పెట్టుకున్నాడు.  సినిమా రెమోకు తీవ్ర నిరాశను కలిగించింది.  ఈ సినిమా ప్లాప్ కావడం వెనుక ఉన్న కారణాలను రెమో మీడియాతో వెల్లడించాడు.  

రేస్ 3 కు సంబంధించి మొదట తాను అనుకోని రాసుకున్న కథ, కథనాలు వేరని, నిర్మాతలు కథనాల్లో అనేక మార్పులు చేయించడం.. సల్మాన్ ను నెగెటివ్ గా చూపించే ప్రయత్నం చెయ్యొద్దని చెప్పడంతో కథ పక్కదోవ పట్టిందని అన్నారు.  సల్మాన్ ఖాన్ కూడా సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేయడంతో మొదటికే మోసం వచ్చిందని అన్నారు.  ప్రమోషన్ విషయంలో కూడా అనుకున్నట్టుగా ప్రమోషన్ చేయలేదని.. రేస్ 3 కంటే చెత్తగా ఉన్న సినిమాలు సైతం మంచి వసూళ్లు సాధించాయని రెమో పేర్కొన్నాడు.  

రెమో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ లో సంచలనంగా మారాయి.  సల్మాన్ ఖాన్ ను తప్పుపట్టడంతో రెమోను కొందరు విమర్శించడం మొదలుపెట్టారు.  రేస్ 4 సినిమాను రెమో చేస్తారని వార్తలు వచ్చినా.. ఇప్పుడు ఆ సినిమా నుంచి ఆయనను తప్పించారని వార్తలు వస్తున్నాయి.  ప్రస్తుతం రెమో చేస్తున్న సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ పాత్ర చేయాల్సి ఉన్నది.  మరి ఈ వివాదం నేపథ్యంలో సల్మాన్ ఖాన్ రెమో సినిమాలో గెస్ట్ పాత్ర చేస్తారా లేదా అన్నది తెలియాలి.