ఉద్యోగావకాశాల పేరుతో నిలువు దోపిడి

ఉద్యోగావకాశాల పేరుతో నిలువు దోపిడి

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో ఘరానా మోసాలకు పాల్పడుతున్న దల్విందర్ సింగ్ అనే వ్యక్తిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం... దల్విందర్ సింగ్ వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇచ్చి వారిని వీసా పేరుతో ఢిల్లీకి రప్పిస్తాడు. హోటల్ లో భోజనం చేస్తున్న సమయంలో వారికి మత్తుమందు ఇచ్చి ఏటీఎం కార్డులు, డబ్బులు కాజేసి పారిపోతాడు. ఇతని బాధితుల్లో హైదరాబాద్, మహబూబ్ నగర్ కు చెందిన వారు ఉన్నారు. జరిగిన మోసంపై ఢీల్లీ ఝాన్నీ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. దీంతో బాధితులు రాచకొండ పోలీసులు ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకుని నిందితులు దల్విందర్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. 2012 నుంచి ఇదే తరహలో మోసాలకు పాల్పడుతున్నట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. పలు రాష్ట్రాల్లో కూడా ఇతని పై కేసులు నమోదయ్యాయని అన్నారు.