'చంద్రబాబు పెట్టిన ఇబ్బందులను మరచిపోలేం'

'చంద్రబాబు పెట్టిన ఇబ్బందులను మరచిపోలేం'

చంద్రబాబునాయుడు పెట్టిన ఇబ్బందులను మరచిపోలేమని వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి చెప్పారు. ఇవాళ అసెంబ్లీ లాబీల్లో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు కానీ.. లోకేష్ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం కాకూడదని ఓ 60 మంది ఎమ్మెల్యేలం దళంగా ఏర్పడ్డామని చెప్పారు. గతంలో పోరాట వీరులం.. ఇప్పుడు పరిపాలన దక్షులం అని పేర్కొన్న ఆయన..  తనకు పదవుల మీద వ్యామోహం లేదని స్పష్టం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి కోసమే పనిచేస్తున్నామని రాచమల్లు వివరించారు.