ప్రభాస్ సినిమాలో భారీ బడ్జెట్‌తో యాక్షన్‌ ఎపిసోడ్స్‌

ప్రభాస్ సినిమాలో భారీ బడ్జెట్‌తో యాక్షన్‌ ఎపిసోడ్స్‌

ఈ మధ్య ప్రభాస్ సినిమా అంటే ఫ్యాన్స్ బీభత్సమైన యాక్షన్ సీన్స్ ఎక్స్పెట్ చేస్తారు. ఇటీవల వరుసగా తన సినిమాల్లో యాక్షన్ సీన్స్ ఉండేలా చేసుకుంటున్నాడు డార్లింగ్. ప్రభాస్‌ ఏడేళ్ల నుంచి యాక్షన్‌ హీరోగానే కనిపిస్తున్నాడు. మాహిష్మతి సామ్రాజ్యంలో వారియర్‌గా నాలుగేళ్లు గడిపిన ప్రభాస్, 'సాహో'లో సూపర్‌ హీరోగా కనిపించాడు. అయితే ఈ యాక్షన్‌ మూవీస్‌ తర్వాత ప్యూర్‌ లవ్‌ స్టోరీతో మళ్లీ డార్లింగ్‌ని బయటకి తీసుకొస్తానని చెప్పాడు ప్రభాస్. అయితే ఇప్పుడు 'రాధేశ్యామ్'ని కూడా రొమాన్స్‌ కమ్‌ యాక్షన్‌ మూవీగా మార్చేస్తున్నాడట డార్లింగ్.'రాధేశ్యామ్' పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా స్టార్ట్ అయ్యింది. ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో వింటేజ్‌ లవ్‌స్టోరీగా మొదలైన ఈ సినిమాలో యాక్షన్‌ని మిక్స్‌ చేస్తున్నాడు ప్రభాస్. ఈ మూవీలో క్లైమాక్స్ సీన్‌ కోసం హాలీవుడ్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్ నిక్‌ పావెల్‌ని తీసుకొస్తున్నాడట ప్రభాస్. ఈ యాక్షన్‌ సీన్స్‌కి భారీ బడ్జెట్‌ కేటాయిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రభాస్‌ ఈ యాక్షన్‌ ఇదిలోనే విమర్శల్లో పడ్డాడు. 'సాహో'లో యాక్షన్‌ ఎపిసోడ్స్‌ మరీ ఓవర్‌గా ఉన్నాయనే కామెంట్స్‌ వచ్చాయి. క్లైమాక్స్‌ ఎపిసోడ్‌ని ఓవర్‌గా ట్రోల్‌ చేశారు జనాలు. ఇప్పుడు 'రాధేశ్యామ్' యాక్షన్‌ సీన్స్‌ కోసం హాలీవుడ్‌ టెక్నీషియన్స్ వస్తున్నారనగానే ఈ సినిమా 'సాహో2'లా మారుతుందా అని సెటైర్లు పేలుస్తున్నారు ఇండస్ట్రీ జనాలు.