రాధికా ఆప్టే పెళ్లి సమయంలో ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..!!

రాధికా ఆప్టే పెళ్లి సమయంలో ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..!!

బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే గురించి సౌత్ ప్రేక్షకులకు కూడా బాగా తెలుసు.  సౌత్ లో బాలకృష్ణ, రజినీకాంత్ సినిమాల్లో నటించి మెప్పించింది రాధికా ఆప్టే.  బాలీవుడ్ లో సినిమాల్లో నటిస్తూనే హాట్ హాట్ ఫోజులతో మెప్పించడంలో దిట్ట రాధికా.  కాగా, ఈ హీరోయిన్ తన పెళ్ళినాటి ముచ్చట్లను ఇటీవలే మీడియాతో పంచుకుంది.  

తన పెళ్లి 2012లో లండన్ కు చెందిన బెన్‌ డిక్ట్‌ టైలర్‌ ను వివాహం చేసుకుంది.  రిజిస్టర్ వివాహం చేసుకుంది.  వివాహం సమయంలో ఈ హీరోయిన్ తన అమ్మమ్మ చీరను కట్టుకుంది.  చీర పాతది కావడంతో అక్కడక్కడ చిరుగులు ఉన్నాయని చెప్పింది.  తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి తన అమ్మమ్మ అని ఆమె కట్టుకున్న చీరను పెళ్లిరోజు కట్టుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది.  ఇక రిసెప్షన్ రోజున 80 మందిచేత మామిడి విత్తనాలు నటించినట్టు రాధికా పేర్కొంది.  వాళ్లందరికీ త్వరలోనే మామిడి పండ్లను పంపిస్తానని చెప్పింది రాధికా.  పెళ్లిని ఆర్భాటంగా చేసుకోవడం తనకు ఇష్టం లేదని, అందుకే రిజిస్టర్ వివాహం చేసుకున్నట్టు చెప్పుకొచ్చింది రాధికా ఆప్టే