బాలీవుడ్ కు వెళ్తే రేప్ చేస్తారని అన్నారు : హీరోయిన్

బాలీవుడ్ కు వెళ్తే రేప్ చేస్తారని అన్నారు : హీరోయిన్

రొటీన్ కు భిన్నమైన సబ్జెక్ట్ లతో, సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకర్షించే బ్యూటీ రాధికా ఆప్టే .ఈ భామ తెలుగులోనూ మంచి గుర్తింపు దక్కించుకుంది. రక్తచరిత్ర, రక్తచరిత్ర 2, లెజెండ్, లయన్, కబాలి లాంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తాజాగా ఈ టాలెంటెడ్ బ్యూటీ కెరీర్ స్టార్టంగ్ లో తనకు ఎదురైన చేదు అనుభవాలపై పెదవి విప్పింది.
ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాల్లో నటించడానికి తను ముంబయికి వెళ్లాలి అనుకున్నప్పుడు చాలా మంది బాలీవుడ్‌ గురించి చెడుగానే చెప్పారని తెలిపింది. బాలీవుడ్ ఒక నరక కూపమని అందులోకి దిగితే బయటకు రాలేమని తనని నిరుత్సాహపరిచారని, అక్కడికి వెళ్తే నీపై అత్యాచారం చేస్తారు. బాలీవుడ్‌ సినీ పరిశ్రమలో ఇదే జరుగుతోందని చెప్పారు. సినీ పరిశ్రమలో జరిగే విషయాలపై ప్రజలకు సదాభిప్రాయం లేదు.  అంటూ రాధికా చెప్పుకొచ్చింది .