కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేపై దాడి

కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేపై దాడి

ఉత్తరప్రదేశ్ లో గుర్తుతెలియని దుండగులు కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే అదితీ సింగ్ పై దాడి చేశారు. రాయ్ బరేలిలోని హరచంద్ పూర్ లో ఘటన జరిగింది. దుండగుల నుంచి తప్పించుకునే క్రమంలో ఆమె ప్రయాణిస్తున్న కారు బోల్తా పడడంతో స్వల్పగాయాలయ్యాయి. రాయ్‌బరేలీ పంచాయతీ అధ్యక్షుడు, బీజేపీ నేత అవదేశ్‌ సింగ్‌ విశ్వాస పరీక్షకు హాజరు అయ్యేందుకు ఆమె వెళుతుండగా ఈ దాడి జరిగింది. రాయ్‌బరేలీ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి, అవదేశ్‌ సింగ్‌ సోదరుడు దినేశ్‌ సింగ్‌ ఈ దాడి చేయించారని అదితీ సింగ్‌ ఆరోపించారు. రెండు కార్లలో దుండగులు వచ్చి మమ్మల్ని అడ్డుకున్నారని తెలిపింది. దాదాపు 50 మంది ఈ దాడిలో పాల్గొన్నారని పేర్కొంది.