యూఎస్ ఓపెన్ విజేత నాదెల్‌

యూఎస్ ఓపెన్ విజేత నాదెల్‌

యూఎస్‌ ఓపెన్ ఫైనల్‌లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ జైత్రయాత్ర కొనసాగించాడు. యూఎస్ ఓపెన్‌ టైటిల్‌ను నాల్గోసారి తన ఖాతాలో వేసుకున్నాడు... ఉత్కంఠభరితంగా సాగిన మెన్స్ సింగిల్స్‌ పోరులో ప్రత్యర్ధి మెద్వెదేవ్‌ను మట్టికరిపించాడు నాదెల్.. ఉత్కంఠబరితంగా 4 గంటల 50 నిమిషాల పాటు జరిగిన ఫైనల్ మారథాన్ మ్యాచ్‌లో రష్యాకు చెందిన మెద్వెదేవ్‌పై విజయం సాధించి తన కెరీర్‌లో 19వ గ్రాండ్ స్లామ్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఐదుసెట్ల థ్రిల్లింగ్ మ్యాచ్‌ను 7-5, 6-3, 5-7, 4-6, 6-4 సెట్ల తేడాతో కైవసం చేసుకున్నాడు రాఫెల్ నాదల్. ఈ విక్టరీతో 19 గ్రాండ్‌ స్లామ్ టైటిల్స్‌ తన ఖాతాలో వేసుకున్న నాదల్.. 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన రోజర్ ఫెదరర్‌ రికార్డుకు ఒకే అడుగు దూరంలో ఉన్నాడు.