రేపు పార్లమెంటులో రఫేల్ పై కాగ్ నివేదిక..? 

రేపు పార్లమెంటులో రఫేల్ పై కాగ్ నివేదిక..? 

రఫేల్‌ డిల్ పై కాగ్ నివేదికను కేంద్ర ప్రభుత్వం రేపు  పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్‌ సమావేశాలు బుధవారం ముగియనుండటంతో మంగళవారం  కాగ్‌ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. రఫేల్‌ ఒప్పందం వ్యవహారంలో కాగ్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ మహర్షికి పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్నాయని గతంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ ఆరోపించారు. ఆయన ఆడిట్‌ నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలను కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ తోసిపుచ్చారు.  కాగ్‌పై కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు.