రాఫెల్ ఆయుధ పూజ: విమర్శలు.. కౌంటర్..

రాఫెల్ ఆయుధ పూజ: విమర్శలు.. కౌంటర్..

రాఫెల్ యుద్ధ విమానానికి ఆయుధ పూజలు నిర్వహించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది.. అయితే.. కాంగ్రెస్ నేతల విమర్శలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి అమిత్‌ షా.. ఆయుధ పూజ పేరుతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్.. ఫ్రాన్స్‌లో తమాషా చేశారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే.. అలాంటి తమాషాలు అవసరం లేదు. ఇంతకు ముందు మేం బోఫోర్స్ గన్ తెచ్చినప్పుడు... ఎవరూ అలా వెళ్లి ఆర్భాటాలు చెయ్యలేదు. ఆయుధాలు మంచివా, కావా? అనే విషయం తేల్చాల్సింది వైమానిక దళ అధికారులే. అలా కాకుండా వీళ్లే వెళ్లి, ఆర్భాటాలు చేసి, విమానంలో కూర్చుంటున్నారని ఖర్డే మండిపడ్డారు. 

అయితే, మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. కాంగ్రెస్ పార్టీకి ఏ విషయం మీద విమర్శించాలో కూడా తెలియదని వ్యాఖ్యానించారు. హర్యానాలోని కైతాలో పర్యటించిన అమిత్‌ షా... రాజ్ నాథ్ సింగ్‌.. రాఫెల్ విమానానికి ఆయుధ పూజ చేయడాన్ని తప్పుబడుతున్నారని విమర్శించారు. విజయదశమి రోజే ఆయుధపూజ చేస్తారన్న విషయం కాంగ్రెస్‌కు తెలీదా అని ప్రశ్నించారు అమిత్‌ షా.