రాఫెల్ పునర్విచారణ తీర్పు వాయిదా

రాఫెల్ పునర్విచారణ తీర్పు వాయిదా

రాఫెల్ కేసులో శుక్రవారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగోయ్, జస్టిస్ కౌల్, జస్టిస్ జోసెఫ్ ల ధర్మాసనం ఆప్ నేత సంజయ్ సింగ్ పిటిషన్ ను తిరస్కరించింది. మరోవైపు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పునస్సమీక్ష పిటిషన్ పై విచారణ జరుపుతూ సుప్రీంకోర్ట్ తన నిర్ణయాన్ని రిజర్వ్ లో ఉంచింది. గతంలో సుప్రీంకోర్ట్ తీర్పుపై సంజయ్ సింగ్ వ్యాఖ్యలను కోర్టు తీవ్రంగా పరిగణించింది. రాఫెల్ పై దాఖలైన మిగతా పిటిషన్లపై విచారణ కొనసాగుతుంది.

శుక్రవారం వివాదాస్పద ఫైటర్ జెట్ కొనుగోలు ఒప్పందంపై దర్యాప్తునకు వ్యతిరేకంగా డిసెంబర్ 14న సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపింది. పిటిషనర్లు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, ప్రశాంత్ భూషణ్ తనకు అనుకూలంగా తీర్పు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించి మోసగించిందని ఆరోపించారు.

రాఫెల్ కేసులో డిసెంబర్ 14న ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో కోరారు. ఎందుకంటే 'అనేక తప్పుడు విషయాలు, సంబంధిత సమాచారాన్ని దాచిపెట్టి' అనుకూలమైన తీర్పు పొందడం జరిగిందన్నారు.