రఫెల్ రివ్యూ పిటిషన్లు: తీర్పు రిజర్వ్ లో పెట్టిన సుప్రీం

రఫెల్ రివ్యూ పిటిషన్లు: తీర్పు రిజర్వ్ లో పెట్టిన సుప్రీం

రఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలు ఒప్పందంపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ రఫెల్ డీల్ కి సంబంధించిన పత్రాలు చోరీ అయ్యాయంటూ తన వాదన వినిపించారు. పిటిషన్లపై ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్ట్ తన తీర్పును రిజర్వ్ లో పెట్టింది.

గురువారం సర్కార్ తరఫున అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ వాదిస్తూ రివ్యూ పిటిషన్ నుంచి డీల్ కి సంబంధించిన లీకైన పత్రాలను తొలగించాలని అన్నారు. దేశభద్రతకు సంబంధించిన ఈ పత్రాలపై ప్రభుత్వానికి విశేషాధికారాలు ఉంటాయని ఆయన వాదించారు.

కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత మీరు ఏ విశేషాధికారాలను క్లెయిమ్ చేస్తున్నారని సుప్రీంకోర్ట్ అటార్నీ జనరల్ ను ప్రశ్నించింది. ఈ దస్తావేజులు చోరీ అయిన తర్వాత కోర్టుకు సమర్పించడం జరిగిందని అటార్నీ జనరల్ జవాబిచ్చారు. చివరికి ఉభయ పక్షాల వాదనలు విన్న కోర్టు తన తీర్పును సురక్షితంగా ఉంచింది.