శభాష్ సివంగి: రాఫెల్ యుద్ధవిమానంలో తొలి మహిళ... 

శభాష్ సివంగి: రాఫెల్ యుద్ధవిమానంలో తొలి మహిళ... 

జులై 29 వ తేదీన ఫ్రాన్స్ నుంచి ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు ఇండియాలోని అంబాలా ఎయిర్ బేస్ కు చేరుకున్న సంగతి తెలిసిందే.  అంబాలాలోని ఎయిర్ బేస్ కు చేరుకున్న యుద్ధ విమానాలను 17 స్క్వాడ్రన్ కు చెందిన గోల్డెన్ యురోస్ లో భాగం కాబోతున్నాయి.  ఈ ఐదు విమానాల రాకతో వైమానిక దళం మరింత బలోపేతం అయ్యింది.  రాఫెల్ యుద్ధ విమానాలను నడపడంలో ఫ్లైట్ లెఫ్టినెంట్ లు ఫ్రాన్స్ లో తర్ఫీదు పొందారు.  కాగా, ఇప్పుడు ఈ విమానాలను నడపడంలో తర్ఫీదు ఇస్తున్నారు.  మిగ్ 21 బైసన్ విమానాలు నడిపిన ఫ్లైట్ లెఫ్టినెంట్ సివంగి సింగ్ కు అరుదైన అవకాశం దక్కింది.  రాఫెల్ యుద్ధ విమానం నడిపే అవకాశం దక్కించుకుంది.  రాఫెల్ యుద్ధ విమానం నడపబోతున్న తొలి మహిళగా సివంగి సింగ్ చరిత్ర సృష్టించబోతున్నది.  పాక్ యుద్ధ విమానాన్ని కూల్చిన వింగ్ కమాండర్ అభినందన్ తో కలిసి ఈ రాఫెల్ విమానాన్ని నడపబోతున్నది.