'కాంచన' హిందీ రీమేక్ నుండి లారెన్స్ ఔట్ !

'కాంచన' హిందీ రీమేక్ నుండి లారెన్స్ ఔట్ !

నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ 'కాంచన' సినిమాను హిందీలో రీమేక్ చేయాలనుకున్న సంగతి తెలిసిందే.  అక్షయ్ కుమార్ ఇందులో ప్రధాన పాత్ర చేస్తున్నారు.  'లక్ష్మీ బాంబ్' అనేది సినిమా పేరు.  ఇప్పటికే షూటింగ్ మొదలుకాగా తాజాగా తాను ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్టు లారెన్స్ ప్రకటించారు.  గౌరవం లేని చోట ఉండటం సరికదన్న ఆయన కనీసం తనకు చెప్పకుండానే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారని, ఇలాంటివి చాలా ఉన్నాయని అందుకే బయటికి వచ్చేస్తున్నట్టు ప్రకటించారు.  అలాగే ఎలాంటి అగ్రిమెంట్ చేసుకోలేదు కాబట్టి తాను రాసుకున్న స్క్రిప్టును అక్షయ్ కుమార్ మీదున్న గౌరవంతో వారికే ఇచ్చేస్తానని, దర్శకుడిగా వారికి నచ్చిన వారినే పెట్టుకోవచ్చని అన్నారు.