కమల్ కి విలన్ గా లారెన్స్?

కమల్ కి విలన్ గా లారెన్స్?

తెలుగు వారికి కూడా బాగా పరిచయమున్న కోరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్... రాఘవ లారెన్స్. నటనతోనూ మెప్పించే మన టాలెంటెడ్ యాక్టర్  ఆ మధ్య ఓ సారి కమల్ గురించి కొంచెం తేడాగా మాట్లాడాడు. రజనీకాంత్ మూవీ ఫంక్షన్ లో కమల్ పై వ్యాఖ్యలు చేశాడు. అప్పుడు పెద్ద దుమారమే రేగింది. అయితే, ఇప్పుడు అదే కమల్ హాసన్ సినిమాలో లారెన్స్ నటించబోతున్నాడట! కొరియోగ్రాఫర్ గా, డైరెక్టర్ గా, హీరోగా లారెన్స్ ఎలాంటి విజయాలు సాధించాడో మనకు తెలిసిందే. అయితే, కోలీవుడ్, టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ టాలెంటెడ్ ఆర్టిస్ట్ తాజాగా ఓ క్రేజీ ఆఫర్ అందుకున్నాడు.

దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ఈయనకి విలన్ రోల్ ఆఫర్ చేశాడట. అదీ కమల్ హాసన్ నటించబోతోన్న ‘విక్రమ్’ మూవీలో. లోకనాయకుడితో... లోకేశ్ రూపొందించబోతోన్న ‘విక్రమ్’ కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. త్వరలోనే షూటింగ్ అని కూడా చెబుతున్నారు... కమల్, కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన ‘విక్రమ్’లో... లారెన్స్ నెగిటివ్ రోల్! ఇప్పుడు కోలీవుడ్ లో ఈ చర్చ జోరుగా సాగుతోంది. అయితే, లారెన్స్ వైపు నుంచీ ఇంకా కన్ ఫర్మేషన్ మాత్రం రాలేదు. ఆయన విలన్ గా నటించటానికి ఒప్పుకుంటాడా? డౌటే అంటున్నారు కొందరు.

ఎందుకంటే, కొన్నాళ్ల కిందట రాఘవ లారెన్స్ కాస్త నోరు జారాడు. రజనీకాంత్ అభిమానిగా... నేను చిన్నప్పుడు కమల్ సినిమా పోస్టర్లపై పేడ కొట్టేవాడ్ని... అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అప్పుడు దుమారం రేగటంతో స్వయంగా వెళ్లికి కమల్ కి లారెన్స్ సారీ చెప్పాడు. పెద్దాయన కూడా పెద్ద మనసుతో మన్నించేశాడు. మరి ఇప్పుడు అలాంటి కమల్ హాసన్ తో కలసి నటిస్తాడా? ‘విక్రమ్’లో లారెన్స్ విలన్ గా మారతాడా? చెప్పలేం అంటున్నారు తమిళ సినిమా జనం. చూడాలి మరి, ‘మాస్టర్’ సినిమా కోసం విజయ్ సేతుపతిని విలన్ గా మార్చిన లోకేశ్ కనకరాజ్... లారెన్స్ ని కూడా కన్విన్స్ చేస్తే... ఏదైనా సాధ్యమే!