తన ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చిన రఘురామకృష్ణంరాజు

తన ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చిన రఘురామకృష్ణంరాజు

నరసాపురం ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ నేత రఘురామ కృష్ణంరాజుకు తాజాగా బైపాస్ సర్జరీ చేశారు వైద్యులు... ముంబైలోని ఏసియర్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌లో డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో ఈ సర్జరీ జరిగింది. ఇక, తన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియా వేదికగా ఓ సమాచారాన్ని పంచుకున్నారు రఘురామకృష్ణంరాజు.. "వెంకటేశ్వరుని ఆశీర్వాదం మరియు శ్రేయోభిలాషుల ప్రార్థనలతో, నా బైపాస్ సర్జరీ బాగా జరిగింది.. నేను ప్రస్తుతం కోలుకుంటున్నాను.. అతి త్వరలో మళ్లీ ప్రజా జీవితంలోకి తిరిగి వస్తాను'' అంటూ ట్వీట్ చేశారు రఘురామకృష్ణంరాజు.. కాగా, రఘు రామకృష్ణ రాజు కి సోమవారం బైపాస్ సర్జరీ విజయవంతంగా పూర్తిచేశారు వైద్యులు.