మోడీతో వ్యక్తిగత సంబంధాలు...అందుకే ?

 మోడీతో వ్యక్తిగత సంబంధాలు...అందుకే ?

అమరాతిలో సీఎం వైఎస్ జగన్‌తో నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు భేటీ అయ్యారు. ఆయనతో పాటు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి కూడా సమావేశమయ్యారు. లోక్‌సభలో ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా మాట్లాడారని ఇప్పటికే రఘురామ కృష్ణంరాజుపై సీరియస్ అయ్యారు. ఐతే తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదని ఇది వరకే వివరణ ఇచ్చారు ఎంపీ. ఇక పార్లమెంట్‌లో ప్రధాని మోదీ.. రఘురామ కృష్ణంరాజును పలకరించడం, ఆయన ప్రధానికి నమస్కరిండం ఏపీ రాజాకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌తో రఘురామ కృష్ణంరాజు భేటీ కావడంతో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఆ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రధాని మోడీతో తనకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయన్నారు. ఆ చొరవతోనే తనను పలకరించారే తప్ప.. వేరే రాజకీయ అంశాలేవీ లేవన్నారాయన. తాను పార్టీ లైన్‌ ఎక్కడా దాటలేదన్నారు. పార్లమెంట్‌లో తెలుగు భాషపై మాట్లాడిన దానిపై సుమోటోగా సీఎమ్‌కు వివరణ ఇచ్చానన్నారు ఎంపీ రఘురామ కృష్ణం రాజు. సుజనా చౌదరితో ఏ వైసీపీ నేతా టచ్‌లో లేరన్నారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు. సుజనా ఎందుకలా మాట్లాడారో ఆయననే అడిగి తెలుసుకోవాలన్నారు. నిజంగా ఎవరైనా టచ్‌లో ఉంటే వారి పేర్లు చెప్పాలని డిమాండ్ చేశారు ఎంపీ కృష్ణం రాజు.