సిఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్...

సిఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్...

ఏపి ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. సిఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటీషన్ దాఖలు చేశారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ పై 11 చార్జ్ షీట్ లను సీబీఐ నమోదు చేసిందని పిటిషన్ లో పేర్కొన్నారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ప్రతి చార్జ్ షీట్ లో సిఎం జగన్ ఏ-1 గా ఉన్నారని పిటీషనర్ వెల్లడించారు. రాజ్యాంగం పై ప్రమాణం చేసిన వ్యక్తిగా తమ పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఉండాలని పిటీషన్ వేసినట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు.   జగన్ పై నమోదైన కేసులను త్వరగా విచారణ పూర్తి చేయాలని పిటీషన్ లో పేర్కొన్నారు. అయితే..  నేడు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది సీబీఐ కోర్టు.