కనీస ఆదాయ పథకం రూపకల్పనలో రఘురామ్ రాజన్ సాయం:రాహుల్ గాంధీ

కనీస ఆదాయ పథకం రూపకల్పనలో రఘురామ్ రాజన్ సాయం:రాహుల్ గాంధీ

కనీస ఆదాయ గ్యారంటీ పథకంపై తాను పలువురు ఆర్థిక శాస్త్రవేత్తల సలహా తీసుకున్నట్టు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం తెలిపారు. వీరిలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కూడా ఉన్నారు. వీళ్లందరూ ఇది కష్టసాధ్యమైన పని అని అభిప్రాయపడినట్టు చెప్పారు. రాహుల్ గాంధీ సోమవారం ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రతి నెలా రూ.6,000 అందించనున్నట్టు ప్రకటించారు. ప్రతి నెలా ఈ డబ్బు కుటుంబంలోని మహిళల ఖాతాలకు నేరుగా బదిలీ చేస్తామన్నారు.

మంగళవారం జైపూర్ లోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ 'ప్రధానమంత్రి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్నారు. కానీ అది ఓ అబద్ధం. కానీ మేం మా ఈ ఆలోచనను నిజం చేసి చూపిస్తాం. మేం దీనిపై రఘురామ్ రాజన్ సహా పలువురు ఆర్థికవేత్తలతో సంప్రదింపులు జరిపాం' అని చెప్పారు.