ఇండియన్ రైల్వే బోర్డు చైర్మన్ ను కలిసిన రఘు రామకృష్ణ రాజు

ఇండియన్ రైల్వే బోర్డు చైర్మన్ ను కలిసిన రఘు రామకృష్ణ రాజు

ఢిల్లీ పార్లమెంటు లోని సబ్ ఆర్డినేట్ లెజిస్లేషన్ కమిటీ కార్యాలయంలో కమిటీ  చైర్మన్ కనుమూరు రఘు రామకృష్ణ రాజు ఇండియన్ రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ ను నేడు కలిశారు. ఈ సందర్భంగా రఘు రామకృష్ణ రాజు  ఆంధ్రప్రదేశ్ లోని నరసాపురం నుంచి వారణాసి,మచిలీపట్టణం నుంచి బెంగళూరు, మచిలీపట్టణం నుంచి అజ్మీర్ ప్రాంతాలకు నూతన రైళ్లను ప్రవేశపెట్టవలసిందిగా వినతిపత్రం అందించారు.
అలాగే సికింద్రాబాద్ - కాకినాడ కో కెనడా ఎక్స్ప్రెస్ వారానికి మూడు రోజులు బదులుగా ప్రతి రోజు నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని మరియు వారానికి ఒకసారి నడిచే నర్సాపూర్ - సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్ ను రెగ్యూలరైజ్ చెయ్యాలని వినతిపత్రంలో కోరారు.  వీటిపై సానుకూలంగా స్పందించిన వినోద్ కుమార్ యాదవ్ వీలైనంత తొందరగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.