బాబుకు నోటీసులపై రఘువీరా కామెంట్‌..

బాబుకు నోటీసులపై రఘువీరా కామెంట్‌..

బాబ్లీ ప్రాజెక్టు పై ప్రజా పోరాటం చేసిన చంద్రబాబునాయుడు తదితర టీడీపీ నేతలపై కేసులు పెట్టడం, నోటీసులివ్వడం ముమ్మాటికీ తప్పేనని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి అన్నారు. ఇవాళ అనంతపురంలో ఆయన మాట్లాడుతూ ప్రజా పోరాటాల సందర్భంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలన్నారు. వీటిని దొంగతనం.. హత్య కేసులుగా చూడరాదన్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు రావని ఈ సందర్భంగా రఘువీరా అన్నారు.