'తెలంగాణలో మేమూ ప్రచారం చేస్తాం..'

'తెలంగాణలో మేమూ ప్రచారం చేస్తాం..'

తెలుగు ప్రజలకు మేలు జరగాలంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలని ఏపీసీసీ రఘువీరారెడ్డి అన్నారు. ఇవాళ విజయవాడలో ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి గతంలో వెళ్లామని.. తెలంగాణలో మాత్రం తమ సొంత రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లా ప్రచారం చేస్తామని చెప్పారు. పరిపాలనపరంగా రాష్ట్రాలు వేరైనా.. అందరం తెలుగువాళ్లమేనని అన్నారు.