6 నెలలపాటు రాజకీయాలకు దూరంగా ఉంటా

6 నెలలపాటు రాజకీయాలకు దూరంగా ఉంటా

ఆరు నెలలపాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ ప్రదేశ్‌ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రకటించారు. ఇవాళ తిరుమల శ్రీవారిని రఘువీరా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ స్వగ్రామంలో ఆలయాన్ని నిర్మిస్తున్నానని తెలిపారు. అందుకే ఆరు నెలలపాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు.

వాస్తవానికి.. ఎన్నికలు జరిగిన రోజే పీసీసీ అధ్యక్ష పదవికి రఘువీరారెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను అప్పటి పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి పంపించారు. అయితే.. ఆ రాజీనామాను నేటికీ ఆమోదించలేదు.