అగ్రహార సెంట్రల్‌ జైలుకు నటి రాగిణి ద్వివేది..!

    అగ్రహార సెంట్రల్‌ జైలుకు నటి రాగిణి ద్వివేది..!

 శాండల్‌వుడ్‌ డ్రగ్స్ కేసులో కన్నడ నటి రాగిణి ద్వివేదికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దాంతో ఆమెను బెంగుళూరు లోని పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఇక ఇదే కేసులో మరో నటి సంజన గల్రాని, రాహుల్, ప్రశాంత్‌ రంకా, లూమ్‌ పెప్పర్, నియాజ్‌లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. వారందరికి 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే సంజనకు మాత్రం 16వ తేదీ వరకు సీసీబీ కస్టడీని పొడిగించారు. సంజనను సీబీఐ ప్రశ్నించాల్సి ఉన్న నేపథ్యంలో కస్టడీని పొడిగించినట్టు సీబీఐ అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రాగిణికి డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నట్లు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ గుర్తించింది. రాగిణికి డ్రగ్స్ టెస్ట్ కోసం ఆస్పత్రికి తరలించినప్పుడు ఆమె మోసానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. డ్రగ్ టెస్ట్ కోసం యూరిన్ శాంపిల్ ఇస్తూ ఆమె... అందులో నీరు కలిపినట్టు గుర్తించారు.