భారీకాయం అడ్డేకాదు.. స్పిన్‌ మాయాజాలంతో రికార్డులు..

భారీకాయం అడ్డేకాదు.. స్పిన్‌ మాయాజాలంతో రికార్డులు..

విండీస్‌, ఆఫ్గనిస్థాన్ మధ్య జరుగుతున్న టెస్టులో సెంట్రాఫ్ ఎట్రాక్షన్‌ రకీమ్‌ కార్నివాల్‌. తన ఆకారంతోనే కాదు... బౌలింగ్‌తోనూ మెస్మరైజ్‌ చేస్తున్నాడు. భారీకాయాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా... ఇరగదీస్తున్నాడు. తన స్పిన్‌ మాయజాలంతో ఆఫ్ఘన్‌ను కుప్పకూల్చి రికార్డు సృష్టించాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ రకీమ్‌ కార్న్‌వాల్‌ చెలరేగి ఆడాడు. అతడి దాటికి ఆఫ్గన్‌ ఆటగాళ్లంతా వరుసగా పెవిలియన్‌ బాటపట్టారు. ఈ మ్యాచ్‌లో కార్న్‌వాల్‌ అరుదైన రికార్డు సాధించాడు. టెస్టు క్రికెట్‌లో భారత పిచ్‌లపై 10 వికెట్లు పడగొట్టిన వెస్టిండీస్‌ తొలి స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు. 

తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసిన రకీమ్‌... రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లతో చెలరేగాడు. దీంతో విండీస్‌ సేఫ్‌ జోన్‌లో నిలిచింది. ఉపఖండంలో ఆడుతున్న రెండో టెస్టులో 10 వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా అరుదైన గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో భారత స్పిన్నర్లు అశ్విన్, జడేజాల రికార్డుని కార్నివాల్ బద్దలు కొట్టాడు. దీంతో పాటు విదేశాల్లో ఆడే టెస్టుల్లో పది అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన ఏడో విండిస్ స్పిన్నర్‌గా గుర్తింపు సాధించాడు. 26 ఏళ్ల కార్నివాల్‌కు ఇది రెండో అంతర్జాతీయ టెస్ట్‌మ్యాచ్‌.. భారీకాయం వల్లా ఆలస్యంగా ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతడి బరువు 140 కేజీలు. ప్రపంచంలో అత్యంత బరువైన టెస్ట్ క్రికెటర్ రకీమ్ అంటూ కథనాలు వస్తున్నాయి. అయితే ఐసీసీ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.