2పాయింట్ ఓ కు కీరవాణి గళం

2పాయింట్ ఓ కు కీరవాణి గళం

ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 2 పాయింట్ ఓ.  ఈ సినిమాలో రెండు పాటలే ఉన్నాయి.  రోబో సినిమాలో 6 పాటలు ఉంటె 2పాయింట్ ఓ రెండే పాటలు ఉన్నాయి.  ఈ రెండు పాటలనే ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.  ఇందులో మరోపాట కూడా ఉందట.  బుల్లి గువ్వ అనే పాట.  ఈ పాటను తెలుగులో కీరవాణి చేత పాడించినట్టు రెహ్మాన్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు.  

ఇది చాలా స్పెషల్ సాంగ్ అని, కీరవాణి గాత్రం అద్భుతంగా ఉందని ఈ సినిమాలో కీరవాణి సాంగ్ పడినందుకు కృతజ్ఞతలు అని చెప్తూ రెహమాన్ ట్వీట్ చేశారు.