అప్పట్లో గవాస్కర్.. ఇప్పుడు సచిన్‌...

అప్పట్లో గవాస్కర్.. ఇప్పుడు సచిన్‌...

ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా పేరుతెచ్చుకున్న రాహుల్‌ ద్రవిడ్‌.. ఇప్పుడు టీమిండియా జూనియర్స్‌కు కోచ్‌గా సేవలందిస్తున్నాడు. ఎంతో మందికి రోల్‌ మోడల్‌గా ఉన్న ద్రవిడ్‌... తన కోరికను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. 'సునీల్‌ గావస్కర్‌తో ఒకసారి కలిసి ఆడితే బాగుంటుందని నా కోరిక. సన్నీతో బ్యాటింగ్‌ చేశాక.. గుండప్ప విశ్వనాథ్‌ క్రీజులోకి వస్తే బాగుంటుంది. నేను ఎదిగేటపుడు నా చిన్ననాటి హీరోలు వాళ్లు' చెప్పాడు. ఇక.. సచిన్‌ టెండూల్కర్‌తో కలిసి జీవితాంతం క్రికెట్‌ ఆడడానికి రెడీ అని అన్నాడు. బ్రియాన్‌ లారా టెక్నిక్‌కు తిరుగులేదని, అతడి సృజనాత్మకత, నైపుణ్యాన్ని ఎక్కువ మంది ఆటగాళ్లలో చూడలేమని ద్రవిడ్‌ అన్నాడు. ఒకవేళ తాను ఆత్మకథ రాస్తే 'ఎప్పుడూ రాయని ఒక పుస్తకం' అని పేరు పెడతానని చెప్పాడు. ప్రస్తుత బౌలర్లలో స్టార్క్‌, కాగిసో రబాడ, భువనేశ్వర్‌ను ఎదుర్కోవడం సవాలేనని అన్నాడు.