బీసీసీఐ కరోనా పరీక్షలు కూడా ద్రవిడ్ ఆధ్వర్యంలోనే...

బీసీసీఐ కరోనా పరీక్షలు కూడా ద్రవిడ్ ఆధ్వర్యంలోనే...

దేశం లో క్రికెట్ ను పునః ప్రారంభించడానికి బీసీసీఐ సన్నాహాలు ప్రారంభించింది. దాని కోసం శిక్షణ శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. కానీ అందులో పాల్గొనే ఆటగాళ్లకు ముందుగా రెండు కరోనా పరీక్షలు నిర్వహిస్తుంది. అందులో నెగెటివ్ వచ్చిన వారు మాత్రమే బీసీసీఐ శిక్షణకు అనుమతినిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా కోవిడ్ టాస్క్ ఫోర్స్  అధికారులను ఏర్పాటు చేసింది బీసీసీఐ. కానీ ఆ అధికారుల టీం ను మాత్రం ప్రస్తుత జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ కింద నియమించింది. అంటే వారందరిని నడిపించాల్సింది ఈ భారత మాజీ కెప్టెన్. అయితే ఈ టీం కరోనా పరీక్షలను నిర్వహించడం మాత్రమే కాకుండా ఆటగాళ్లు అందరూ కరోనా నియమాలు పాటిస్తున్నారా... లేదా అనేది కూడా చూసుకోవాలి. ఇక ఇదిలా ఉంటె సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు జరిగే ఐపీఎల్ కోసం ఆటగాళ్లు ఆగస్టు 26న యూఏఈ కి వెళ్లనున్నారు. కానీ అనూహ్యంగా ఐపీఎల్ స్పాన్సర్ వివో తన స్పాన్సర్ షిప్ హక్కుల నుండి తప్పుకుంటున్నట్లుగా ఈ రోజు తెలిపి బీసీసీఐ కి షాక్ ఇచ్చింది.