పుల్వామా దాడితో ఎవరు లాభపడ్డారు? ఇప్పటి వరకు ఏం తేల్చారు..?

పుల్వామా దాడితో ఎవరు లాభపడ్డారు? ఇప్పటి వరకు ఏం తేల్చారు..?

పుల్వామా ఉగ్ర దాడి జరిగి ఏడాది అయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేత, పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ.. కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించారు. 40 మంది జవాన్లను బలిగొన్న పుల్వామా దాడి వల్ల ఎవరు లాభపడ్డారిని ప్రశ్నించారు. ఇక, పుల్వామా ఘటనపై విచారణ చేసి ఇప్పటి వరకు ఏం తేల్చారు..? 40 మంది ప్రాణాలు కోల్పోవడానికి, భద్రతా వైఫల్యానికి కేంద్ర ప్రభుత్వంలో ఎవరు బాధ్యత వహిస్తూరంటూ... వరుసగా మూడు ప్రశ్నలను ట్విట్టర్‌లో సంధించారు రాహుల్ గాంధీ. పుల్వామా ఘటనపై ట్విట్టర్ స్పందించిన రాహుల్ గాంధీ.. 40 మంది జవాన్లు బలిగొన్న పుల్వామా దాడి వల్ల ఎవరు లాభ పడ్డారు? విచారణలో ఇప్పటి వరకు ఏం తేల్చారు? భద్రతా వైఫల్యానికి బీజేపీ ప్రభుత్వంలో ఎవరు బాధ్యత వహిస్తారు? అంటూ ప్రశ్నించారు. కాగా, జమ్ముశ్రీనగర్‌ హైవేపై 2019 ఫిబ్రవరి 14న భారతీయ సైనికులు ప్రయాణిస్తున్న వాహనాలపై లేథిపురా దగ్గర కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగిన సంగతి తెలిసిందే.