రాహుల్‌ గాంధీతోపాటు మేనల్లుడు కూడా..

రాహుల్‌ గాంధీతోపాటు మేనల్లుడు కూడా..

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతోపాటు ఆయన మేనల్లుడు రేహాన్‌ వాద్రా కూడా కాలినడకన తిరుమల చేరుకున్నారు. ఉదయం 11.40 గంటలకు అలిపిరిలో నడక ప్రారంభించిన రాహుల్‌.. బ్రేక్‌ ఇవ్వకుండా రెండు గంటల్లోనే సుమారు 3500లకు పైగా మెట్లు ఎక్కారు. మేనల్లుడు రేహాన్‌ వాద్రాతో కలసి పోటీపడుతూ రాహుల్‌ నడిచారు. స్వామి దర్శనం అనంతరం  తిరుపతిలో భరోసా యాత్రలో ఆయన పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. గత ఎన్నికల్లో మోడీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చిన వేదిక నుంచే ప్రజలకు భరోసా ఇవ్వనున్నారు.