తమిళనాడులో రాహుల్ ప్రచారం... 

తమిళనాడులో రాహుల్ ప్రచారం... 

ఏప్రిల్ 6 వ తేదీన తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి.  డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్య ప్రధాన పోరు జరగబోతున్న సంగతి తెలిసిందే.  అయితే, ఈ రెండు పార్టీలతో అనేక పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి.  డీఎంకేలో కాంగ్రెస్ తో పాటు మరికొన్ని పార్టీలు కూడా పొత్తు పెట్టుకున్నాయి.  కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో 20 స్థానాల్లో పోటీ చేస్తున్నది.  ఎన్నికలు సమీపిస్తుండటంతో రాహుల్ గాంధీ ఈరోజు తమిళనాడులోని రెండు భారీ బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు.  చెన్నై, సాలెం బహిరంగ సభల్లో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించబోతున్నారు. రైతుల సమస్యలు, నిరుద్యోగం తదితర అంశాలతోపాటుగా అన్నాడీఎంకే పై కూడా ఈ సభల్లో విమర్శలు చేసే అవకాశం ఉన్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు.