రాహుల్‌పై వరుణ్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..

రాహుల్‌పై వరుణ్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..

సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ నేతల మధ్య విమర్శలు, ఆరోపణలు ఊపందుకున్నాయి... ఏఐసీసీ అధ్యక్షుడు, తన అన్న అయిన రాహుల్ గాంధీపై బీజేపీ నేత, పిలిభిత్ బీజేపీ అభ్యర్థి వరుణ్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీ వచ్చే రెండు దశాబ్దాల్లోనూ ప్రధాని అయ్యే అవకాశం లేదన్నారు వరుణ్. ప్రధాని నరేంద్ర మోడీకి సరితూగే నాయకుడే కాంగ్రెస్ శిబిరంలో లేరని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే అర్హత లేదన్న వరుణ్.. అందుకే తాను వచ్చే పది, 20 ఏళ్లలోనూ రాహుల్ ప్రధాని కాలేరని చెబుతున్నట్టు వెల్లడించారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు వరుణ్ గాంధీ... మోడీకి జనం ఓట్లు వేయడం మాత్రమే కాదు.. వారి రక్తం కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.