గవర్నర్‌కు రాహుల్ గాంధీ కౌంటర్..

గవర్నర్‌కు రాహుల్ గాంధీ కౌంటర్..

జమ్మూ అండ్ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ వ్యాఖ్యలకు సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు రాహుల్ గాంధీ. ఇక్కడి పరిస్థి కళ్లారా చూసి మాట్లాడాలి.. అవసరమైతే విమానం పంపిస్తామని గవర్నర్ మాలిక్ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్‌లో స్పందించిన రాహుల్. మాలిక్ ఛాలెంజ్‌ను స్వీకరించారు.. గ‌వ‌ర్న‌ర్ మాలిక్ ఆహ్వానాన్ని స్వాగ‌తించిన ఆయన.. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌తో క‌లిసి క‌శ్మీర్‌లో ప‌ర్యటించ‌నున్నట్లు ఆయ‌న తెలిపారు. త‌మ‌కు విమానం అవ‌స‌రం లేదు.. కానీ, క‌శ్మీర్‌లో స్వేచ్ఛగా తిరిగే ప‌రిస్థితులు కల్పించాలని.. స్థానిక ప్రజ‌ల‌ను, ముఖ్య నేత‌ల‌ను, సైనికుల‌ను క‌లుసుకుంటామంటూ ట్వీట్ చేశారు రాహుల్. కాగా, కశ్మీర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని వార్తలు వస్తున్నాయంటూ రాహుల్ చేసిన విమర్వలపై మండిపడ్డా గవర్నర్ సత్యపాల్ మాలిక్.. ఇక్కడి పరిస్థితిని కళ్లారా చూసి మాట్లాడాలని.. ఆయనకు విమానం పంపిస్తానంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.