ట్రాక్టర్ నడిపిన రాహుల్ గాంధీ

ట్రాక్టర్ నడిపిన రాహుల్ గాంధీ

ఎన్నికల ర్యాలీలు, రోడ్ షోలతో తీరిక లేకుండా ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన సరదాను తీర్చుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పంజాబ్ లో పర్యటిస్తున్న ఆయన ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ తో కలిసి ట్రాక్టర్ నడపడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసింది. ఈనెల 19వ తేదీన తుదివిడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నిక‌ల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రస్తుతం ఆయ‌న పంజాబ్‌లో ప‌ర్యటిస్తున్నారు. ప‌లు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో రోడ్ షోల‌ల్లో పాల్గొంటున్నారు. ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా ఈ ఉద‌యం ఫ‌రీద్‌కోట్‌లో బ‌హిరంగ స‌భ‌లో ప్రసంగించారు. అక్కడి నుంచి లూధియానాకు చేరుకున్నారు.