దేశంలో హింసకు అతనే కారణమంటోన్న రాహుల్... 

దేశంలో హింసకు అతనే కారణమంటోన్న రాహుల్... 

దేశంలో గత కొంతకాలంగా మహిళలపై అత్యాచారాలు, హత్యలు, అల్లర్లు జరుగుతున్నాయి.  ఇలా రోజు రోజుకు దేశంలో క్రైమ్ పెరిగిపోవడానికి కారణాం బీజేపీనే అని అంటున్నాడు రాహుల్ గాంధీ.  దేశంలో బీజేపీ హింసను పెంచి పోషిస్తోందని అంటున్నారు.  ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని, కొంతమంది వ్యక్తులు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకున్నారని ఆరోపించారు రాహుల్ గాంధీ.  హింస, విచక్షణారహిత విధానాన్ని విశ్వసించే వ్యక్తి దేశాన్ని పాలిస్తున్నారని ఫలితంగా దేశంలో హింస పెరిగిపోతోందని అన్నారు రాహుల్.