రికార్డ్ స్థాయి మెజారిటీ సాధించిన రాహుల్ !

లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీ, వాయనాడ్ రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేసిన సంగతి తెలిసిందే.  అమేథీలో గెలుపు కోసం పోరాడుతున్న ఆయన వాయనాడ్ నుండి మాత్రం రికార్డ్ స్థాయిలో గెలుపొందారు.  మొత్తం 12.76 లక్షల ఓట్లను సాధించిన ఆయన సమీప ప్రత్యర్థి, సిపిఐ నేత పి.పి. సునీర్ పై 8,08,346 ఓట్ల మెజారిటీ గెలుపొందారు.  ఇప్పటి వరకు వెలువడిన అన్ని ఫలితాల్లో ఇదే అతి పెద్ద మెజారిటీ కావడం విశేషం.