తెలంగాణకు ఏఐసీసీ నుంచి ముగ్గురు ఇంఛార్జ్‌లు...

తెలంగాణకు ఏఐసీసీ నుంచి ముగ్గురు ఇంఛార్జ్‌లు...

తెలంగాణపై ఏఐసీసీ మరింత ఫోకస్‌ పెట్టింది... ఇప్పటికే కుంతియా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ బాధ్యతలు నిర్వహిస్తుండగా... రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల పర్యవేక్షణకు, ముగ్గురు సహా ఇంఛార్జ్‌లను నియమించారు ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ. వీరు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్‌ కుంతియాకి సహాయకులుగా పనిచేయనున్నారు. 1. బోసే రాజు, ఏఐసీసీ కార్యదర్శి (కర్ణాటక), 2. శ్రీనివాన్ కృష్ణన్, ఏఐసీసీ కార్యదర్శి (కేరళ), 3. సలీం అహ్మద్, ఏఐసీసీ కార్యదర్శి (కర్ణాటక)ను సహా ఇంఛార్జ్‌లుగా నియమించారు.