ఎస్పీజీ సేవలపై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు 

ఎస్పీజీ సేవలపై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు 

రాజీవ్ గాంధీ హత్య తరువాత అయన కుటుంబానికి ఎస్పీజీ భద్రతను కల్పించారు.  అప్పటి నుంచి ఎస్పీజీ భద్రతలోనే సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు ఉన్నారు.  కాగా, మోడీ ప్రభుత్వం ఎస్పీజీ భద్రత చట్టంలో మార్పులు తీసుకురావాలని అనుకుంటోంది.  ఇందులో భాగంగానే ఎస్పీజీ భద్రత ఉన్న వ్యక్తులను పరిశీలించి.. అవసరమా కదా అని చర్చించి ఎస్పీజీ భద్రతను తొలగిస్తూ వస్తున్నారు.  

ఇందులో భాగంగానే సోనియా కుటుంబానికి రక్షణ కల్పిస్తూ వస్తున్న ఎస్పీజీని తొలగించింది.  అయితే, వారికీ జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కొనసాగిస్తున్నారు.  ఇంతకాలం తమకు రక్షణ కల్పించిన ఎస్పీజీ సిబ్బందికి రాహుల్ గాంధీ కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు.  అయితే, సోనియా గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను తొలగించడంతో.. కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతున్నది.