రాహుల్ ఆధ్వర్యంలో కశ్మీర్‌కు అఖిలపక్షం..

రాహుల్ ఆధ్వర్యంలో కశ్మీర్‌కు అఖిలపక్షం..

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో అఖిలపక్ష బృందం రేపు జమ్ముకాశ్మీర్ పర్యటించనుంది. గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆహ్వానాన్ని అంగీకరించిన రాహుల్ శ్రీనగర్ కు వెళ్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన తర్వాత మానవహక్కులు హరించాయని రాహుల్ విమర్శలకు గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఘాటుగా సమాధానమిచ్చారు. హెలికాప్టర్ పంపుతానని, వచ్చి చూస్తే రాష్ట్రంలో పరిస్థితి అర్ధమవుతుందని అప్పట్లో సవాల్ విసిరారు. దీనికి ధీటుగా సమాధానమిచ్చిన రాహుల్,  స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతిస్తే చాలన్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ బృందం రాష్ట్రంలో స్థానికులతోపాటు రాజకీయ పార్టీల నేతలతోనూ భేటీ అవుతోంది. ఈ బృందంలో గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి.రాజా, ఆర్జేడీ నేత మనోజ్ ఝా తదితరులు ఉన్నారు.