పూర్తి బాధ్యత నాదే

పూర్తి బాధ్యత నాదే

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని ఆ పార్టీ అధినేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఎన్నికల ఫలితాల తరవాత ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో గెలిచిన ప్రధాని మోడీకి ఆయన తొలుత అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల్లో కేవలం రెండు భావజాలాల మధ్య జరిగిన పోటీ అని ఆయన చెప్పారు. తమ పార్టీ భావజాలాన్ని విశ్వసించే వారు అధిక సంఖ్యలో ఉన్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు, కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలుపుతూనే.... ఓటమితో అధైర్యపడవొద్దని ధైర్యం చెప్పారు. అమేథీలో ఓటమిని అంగీకరించిన రాహుల్‌.... స్మృతి ఇరానీ ప్రేమతో అమేథి అభివృద్ధికి కృషి చేస్తారని తాను ఆశిస్తున్నట్లు రాహుల్‌ చెప్పారు.  నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇరానీ ఎన్నో హామీలు ఇచ్చారని, వాటిని నెరవేర్చుతారన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలపై  కాంగ్రెసార్టీ వర్కింగ్‌ కమిటీ భేటీ త్వరలోనే భేటీ అవుతుందన్నారు. ఇప్పటికిపుడు ఓటమికి కారణాలు చెప్పలేనని అన్నారు.