ఆ రెండూ నాన్నే నేర్పారు: రాహుల్‌ 

ఆ రెండూ నాన్నే నేర్పారు: రాహుల్‌ 

'ప్రేమ, అభిమానం, ఆప్యాయత కలిగిన వ్యక్తి మా నాన్న. ప్రతిఒక్కరినీ ప్రేమించడం, అందరినీ గౌరవించడం నాన్న దగ్గరే నేర్చుకున్నాను. ఆయణ్ను మిస్‌ అవుతున్నాను' అని అన్నారు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.  ఇవాళ మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్థంతి. ఈ సందర్భంగా యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, , ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తదితరులు ఆయనకు నివాళులర్పించారు. రాహుల్ గాంధీ ట్విట్టర్‌ ద్వారా తన తండ్రిని గుర్తు చేసుకున్నారు.