రాహుల్‌ రాజీనామా.. నో అన్న సోనియా?

రాహుల్‌ రాజీనామా.. నో అన్న సోనియా?

సాధారణ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన రాజీనామాకు యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీకి సమర్పించినట్లు కొన్ని జాతీయ ఛానల్స్‌ వార్తలు వస్తున్నాయి. అయితే రాహుల్‌ రాజీనామా ప్రతిపాదనను సోనియా తిరస్కరించినట్లు ఆ ఛానల్స్‌ తెలిపాయి. రాహుల్‌ రాజీనామా వార్తలకు సంబంధించి ఆ పార్టీ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన రాహుల్‌ గాంధీ పార్టీ ఓటమికి తాను పూర్తిగా బాధ్యత వహిస్తున్నానని చెప్పారు. తర్వలోనే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరుగుతుందని, అందులో పార్టీ ఓటమితో పాటు ఇతర అంశాలను చర్చిస్తామని ఆయన అన్నారు.