అదే పెద్ద పరీక్ష.. ఖర్చా పే చర్చ పెట్టండి.. రాహుల్ సెటైర్లు

అదే పెద్ద పరీక్ష.. ఖర్చా పే చర్చ పెట్టండి.. రాహుల్ సెటైర్లు

ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా నిర్వహించిన 'పరీక్ష పే చర్చ'పై సెటైర్లు వేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. కేంద్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తోందని విమర్శించిన ఆయన.. ఈ నేపథ్యంలో కారులో ఇంధనం నింపడం కూడా పెద్ద పరీక్షగా మారిపోయిందన్నారు.. కాబట్టి ప్రధాని మోడీ ‘ఖర్చా పే చర్చ’ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలంటూ కామెంట్ చేశారు.. కేంద్రం పన్నుల వసూళ్లతో కారులో ఇంధనం నింపడం కూడా పెద్ద పరీక్షగా మారిందంటూ సోషల్ మీడియాలో పేర్కొన్న రాహుల్ గాంధీ.. మరి ప్రధాని మోడీ దీనిపై ఎందుకు చర్చంచరు? అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఖర్చు మీద కూడా చర్చ ఉండాలి ఉండాలని తన ట్వీట్‌లో పేర్కొన్నారు రాహుల్.