రాహులే కావాలి..! కాదంటే ప్రియాంక..!

రాహులే కావాలి..! కాదంటే ప్రియాంక..!

కాంగ్రెస్ అధ్యక్షుడి రాహుల్ గాంధీయే కొనసాగాలని విజ్ఞప్తి చేస్తున్నారు తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ రాజీనామా చేశారు. తాను అధ్యక్షుడిని కాదు.. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోండి అని వ్యాఖ్యానించారు.. ఇక ఇవాళ కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియలో తాము ఉండబోమంటూ సోనియాగాంధీ, రాహుల్ గాంధీ వెళ్లిపోయినా.. రాహులే అధ్యక్షుడిగా కొనసాగాలంటూ పట్టుబడుతున్నారు. సోనియా, రాహుల్ లేకుండానే కొత్త అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ సంప్రదింపులు జరుపుతోంది.. విడివిడిగా అన్ని రాష్ట్రాలకు చెందిన నేతలతో సీడబ్ల్యూసీ చర్చిస్తోంది. అయితే, ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ కొనసాగాలని.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకవేళ రాహుల్ అంగీకరించకపోతే ప్రియాంకకు పార్టీ బాధ్యతలు అప్పగించాలని కోరారు.