6న కిసాన్‌ ర్యాలీకి రాహుల్‌

6న కిసాన్‌ ర్యాలీకి రాహుల్‌

నిన్నటి నుంచి దేశ వ్యాప్తంగా రైతులు జరుపుతున్న ఆందోళనకు కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మోడీ హయాంలో ప్రతి రోజూ 35 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం తాము ఎదుర్కొంటున్న పరిస్థితులను కేంద్రం దృష్టికి తేవడానికి రైతులు పదిరోజుల సెలవు అంటూ నిరసన తెలుపుతున్నారు. తనవంతుగా ఈనెల 6న మంద్‌సౌర్‌లో జరిగే రైతుల ర్యాలీని ఉద్దేశించి తాను ప్రసంగిస్తానని రాహుల్‌ వెల్లడించారు. మరోవైపు దేశవ్యాప్తం రైతులు వివిధ రూపాలయల్లో తమ నిరసన  వ్యక్తం చేస్తున్నారు.