రాహుల్ రెండు చోట్లా గెలిస్తే..?

రాహుల్ రెండు చోట్లా గెలిస్తే..?

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని అమేథీతోపాటు కేరళలోని వాయినాడ్‌ నుంచి పోటీ చేసేందుకు నిర్ణయించినట్టు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్‌కు సురక్షితస్థానం. రాజీవ్‌గాంధీ హయాం నుంచి ఈ స్థానం కాంగ్రెస్‌కు అండగా నిలుస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీపై రాహుల్‌ గెలుపొందారు. 

ఇక.. వయనాడ్‌, కోళికోడ్‌, మల్లప్పురం జిల్లాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు వయనాడ్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. 2009లో కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగిన షానవాజ్‌ భారీ ఆధిక్యంతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లోనూ ఆయనే గెలిచారు.  

అంటే.. రాహుల్ రెండు చోట్లా విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవేళ అమేథీ, వాయినాడ్‌లలో గెలుపొందితే ఆయన అమేథీ స్థానాన్ని వదులుకుంటారని తెలుస్తోంది. కాంగ్రెస్‌కు కంచుకోట అయిన అమేథీ నుంచి ఉప ఎన్నికల్లో రాహుల్‌ సోదరి ప్రియాంకా గాంధీ బరిలోకి దిగుతారని సమాచారం.