తిరుపతికి రానున్న రాహుల్ గాంధీ..

తిరుపతికి రానున్న రాహుల్ గాంధీ..

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరుపతికి రానున్నారు... ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతికి చేరుకోనున్నారు కాంగ్రెస్ చీఫ్...  ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ కమిటీ చేపడుతున్న " ప్రత్యేక భరోసా ప్రజాయాత్ర"లో పాల్గొనేందుకు ఆయన టెంపుల్ సిటీకి వస్తున్నారు. రోడ్ షోతో పాటు ఎస్వీ యూనివర్సిటీలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు రాహుల్ గాంధీ. కాగా, రేపు అనంతపురం జిల్లాలోని మడకశిర నియోజకవర్గం నుంచి "ప్రత్యేక హోదా భరోసా ప్రజాయాత్ర' ప్రారంభం కానుంది. రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే యాత్రలో కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ఏపీ ఇంచార్జి ఉమెన్ చాందీ, కర్ణాటక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర మంత్రి డీకే శివకుమార్ తదితరలు పాల్గొంటారు.