రాహుల్ విమానంలో సాంకేతిక లోపం..

రాహుల్ విమానంలో సాంకేతిక లోపం..

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాహుల్ గాంధీ పాట్నాకు బయల్దేరారు. అయితే, మార్గమధ్యలోనే రాహుల్ ప్రయాణిస్తున్న విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో మళ్లీ ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా రాహుల్ గాంధీయే వెల్లడించారు. బీహార్‌లోని సమస్తిపూర్, ఒడిశాలోని బాలాసోర్,  మహారాష్ట్రలోని సంగంనేర్‌లో జరగాల్సిన ఎన్నికల ప్రచార సభలు కొంచెం ఆలస్యంగా జరుగుతాయని ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ.